భారతదేశం, జూలై 5 -- Celina Jaitly Twins Read Her Divorce: ఒకప్పుడు బాలీవుడ్‌లో గ్లామర్ క్వీన్‌గా వెలిగిన మాజీ మిస్ ఇండియా, తెలుగు సీనియర్ హీరోయిన్ సెలీనా జైట్లీ వ్యక్తిగత జీవితం ఇప్పుడు తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. భర్త పీటర్ హాగ్ నుంచి విడిపోవడానికి ఆమె చట్టపరమైన పోరాటం చేస్తున్నారు.

అయితే సెలీనా జైట్లీ విడాకుల వ్యవహారం రోజురోజుకూ అత్యంత బాధాకరంగా మారుతోంది. తన 15వ పెళ్లి రోజునాడే భర్త చేతికి విడాకుల పత్రాలు ఇవ్వడం, ఆ సమయంలో ఎదురైన ఘోర అవమానాలను గుర్తుచేసుకుంటూ సెలీనా కన్నీటిపర్యంతమయ్యారు.

2010లో ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను సెలీనా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

అయితే, కొన్నేళ్లుగా భర్త నుంచి ఎదురవుతున్న మానసిక, శారీరక వే...