భారతదేశం, మార్చి 7 -- అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష.. కానీ ఇప్పుడు ఆ శిక్ష రద్దయింది. దీనికి కారణం నిందితుడు బాధితురాలినే వివాహం చేసుకోవడం. భారత రాజ్యాంగం కల్పించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు వెలువరించింది. అయితే, ఈ విముక్తికి ఒక బలమైన నిబంధనను కూడా కోర్టు విధించింది.
ఈ కేసు ఒక ప్రేమ వ్యవహారం నుండి మొదలైంది. నిందితుడు, ఒక బాలిక మధ్య సంబంధం ఉన్న సమయంలో ఆమె మైనర్. ఈ క్రమంలో అతనిపై ఐపీసీ సెక్షన్ 376(2)(n) (అత్యాచారం), పోక్సో (POCSO) చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు నమోదైంది. ఒడిశాలోని జైపూర్ ట్రయల్ కోర్టు అతనికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది.
దీనిపై అతను ఒడిశా హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, శిక్షపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కేవలం పరిమిత కాలానికి మాత్రమే మధ్యంతర బెయిల్ మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.