భారతదేశం, జూన్ 10 -- అధికమాసంలో శుభకార్యాలకు బ్రేక్ పడింది. అధిక జ్యేష్ఠ మాసం కొన్ని రోజులతో పూర్తి కాబోతోంది. ఈ అధికమాసం ముగింపుకు రావడంతో వివాహం చేసుకోవాలనుకునే వారికి, వారి తల్లిదండ్రులకు కాస్త ఊరట లభించబోతోంది.

పంచాంగం ప్రకారం, అధికమాసం పూర్తి అయ్యాక జూన్ 19 నుంచి పెళ్లిళ్లతో పాటు ఇతర శుభకార్యాలు ప్రారంభం కాబోతున్నాయి. మన హిందూ సంప్రదాయం ప్రకారం అధికమాసంలో పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాలు జరపరు. ఒక నెల పాటు వీటన్నిటికీ బ్రేక్ పడింది. మళ్లీ జూన్ చివరి వారం నుంచి అద్భుత యోగాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక మాసం పూర్తయిన తర్వాత గ్రహాలు, నక్షత్రాల స్థితి అనుకూలంగా మారనుంది. జూన్ చివరి రోజుల్లో చూసినట్లయితే వివాహాలకు అనుకూలమైన శుభ నక్షత్రాలు కలిసి వస్తున్నాయి. ఉత్తర ఫల్గుణి, హస్త, స్వాతి, అనూరాధ, మూల నక్షత్రాల్లో ...