భారతదేశం, డిసెంబర్ 22 -- కుంభమేళాతో తెగ పాపులర్ అయిన బ్యూటి మోనాలిసా. కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది. అంతేకాకుండా రోజు రోజుకీ మోనాలిసా క్రేజ్ పెరిగిపోతుంది. ఇటీవల హైదరాబాద్‌లోనూ మోనాలిసా ప్రత్యక్షమైంది.

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థ 'బేల్ ట్రీ హోటల్' తన సేవలను మరింత విస్తరిస్తూ, అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన నూతన కిచెన్ విభాగాన్ని 'కుంభమేళా' ఫేమ్ మోనాలిసా శనివారం (డిసెంబర్ 20) ఉదయం ప్రారంభించింది.

ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం, సిబ్బంది మోనాలిసాకు ఘనస్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసి, సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె కిచెన్ విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హోటల్ పరిసర ప్రాంతాలు అభిమానుల కోలాహలంతో కిక్కిరిసిపోయాయి.

కిచెన్‌ను ప్రారంభించిన అనంతరం మోనాలిసా మాట్లాడుతూ.. "బేల్ ట్ర...