భారతదేశం, జూలై 2 -- మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలామంది ఆ ఫండ్ సైజ్ లేదా ఏయూఎమ్ (ఆస్తుల నిర్వహణ) ఎంత ఉందో చూస్తారు. ఎక్కువ మంది పెట్టుబడిదారులు నమ్మిన ఫండ్ కాబట్టి లాభాలు కూడా భారీగానే ఉంటాయని భావిస్తారు. అయితే, భారీ నిధులు నిర్వహిస్తున్న ఫండ్స్ అన్నీ అత్యుత్తమ రిటర్న్స్ ఇస్తున్నాయా? దేశంలోనే అతిపెద్ద టాప్ 5 మ్యూచువల్ ఫండ్ల గత 1, 3, 5 ఏళ్ల పనితీరును పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

యాసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (AUM) అంటే సదరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నిర్వహిస్తున్న మొత్తం పెట్టుబడుల మార్కెట్ విలువ. ఏయూఎమ్ ఎక్కువగా ఉందంటే అందులో పెట్టుబడిదారుల సంఖ్య, వారి నమ్మకం ఎక్కువగా ఉన్నట్లు అర్థం. ప్రస్తుతం దేశంలో కొన్ని లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సొమ్మును టాప్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తున్నాయి.

భారతీయ మ్యూచువల్ ఫండ్ ...