భారతదేశం, మే 22 -- పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో, భారతీయ ఇంధన రంగంపై ఒత్తిడి తీవ్రమైంది. దేశీయ చమురు సంస్థలు వినియోగదారులపై భారం పడకుండా రక్షించేందుకు రోజుకు రూ.1,000 కోట్ల వరకు నష్టపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపును జాతీయ ఆర్థిక ప్రాధాన్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. ఆ వెంటనే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ.4 మేర పెరిగాయి. క్లీన్ ఫ్యూయల్‌గా భావించే సీఎన్జీ ధరలు కూడా పెరిగావు.

భారతదేశం తన ముడిచమురు అవసరాల కోసం ఏకంగా 88% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ తరుణంలో ఇంధన డిపెండెన్సీని తగ్గించడానికి, మొనాకోకు చెందిన ఫ్యూయల్ టెక్నాలజీ సంస్థ 'ఎఫ్​ఓడబ్ల్యూఈ ఎకో సొల్యూషన్స్' కనిపెట్టిన పేటెంటెడ్ 'కేవిటెక్ ఫ్యూయల్ ఎ...