భారతదేశం, సెప్టెంబర్ 11 -- అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మండిపోతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులకు వేగంగా అడుగులు వేస్తోంది. దేశంలో పెట్రోల్ వినియోగాన్ని పరిమితం చేస్తూ, బయోఫ్యూయల్ వాటాను పెంచేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయనుంది. ఇప్పటివరకు అమలు చేస్తున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమం (ఈ20) కంటే ఎక్కువ శాతంలో ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం 'ఫ్లెక్స్-ఫ్యూయల్' వాహనాలను విస్తృతంగా అందుబాటులోకి తేనున్నట్లు ప్రధానమంత్రి సలహాదారు తరుణ్ కపూర్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర బ్యారెల్‌కు దాదాపు 100 డాలర్లకు చేరింది. భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారతదేశానికి ఇ...