భారతదేశం, మార్చి 14 -- న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, దేశంలో ఇంధన సరఫరాపై నెలకొన్న నీలినీడలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. భారత్‌లో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరా ఆగిపోతుందనే భయంతో చాలామంది పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఒక అడ్వైజరీ జారీ చేసింది. "దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్‌లెట్లలో పెట్రోల్, డీజిల్ తగినంత అందుబాటులో ఉన్నాయి. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు" అని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా, అనధికారిక కంటైనర్లు లేదా బాటిళ్లలో పెట్రోల్‌ను తీసుకెళ్లడం, నిల్వ చేయడం ప్రాణాంతకమని, అలాంటి పనులు చేయవద్దని హెచ్చరించింది.

భద్రతా నిబంధనలు ఉల్...