భారతదేశం, ఏప్రిల్ 7 -- ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 96 కోర్టులు రానున్నాయి. కేసుల పెండింగ్‌ను తగ్గించడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 96 అదనపు కోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసింది. జీవో ప్రకారం, కొత్తగా మంజూరైన కోర్టులలో జిల్లా, సెషన్స్ కోర్టు కేడర్‌లో 12, ​​సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కేడర్‌లో 25, జూనియర్ సివిల్ జడ్జి కేటగిరీలో 59 కోర్టులు ఉన్నాయి. ముఖ్యంగా కేసుల పెండింగ్ అధికంగా ఉన్న జిల్లాల్లో ఈ నిర్ణయం న్యాయ సేవలను మరింత సులభతరం చేస్తుందని భావిస్తున్నారు.

ఈ కోర్టుల ఏర్పాటుతో పాటు, 1,730 కొత్త పోస్టుల సృష్టికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పోస్టులు న్యాయాధికారుల నుండి పరిపాలనా, సహాయక సిబ్బంది వరకు, ఆఫీస్ సబార్డినేట్ సిబ్బందితో సహా వివిధ స్థాయిలలో ఉంటాయి. కోర్టుల సంఖ్యను పెంచడమే కాకుండా.. అవి సమర్థవంతంగ...