Andhrapradesh,kadapa, ఆగస్టు 12 -- పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పొలింగ్ కొనసాగుతోంది. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా.పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. అయితే కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అరెస్ట్‌ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఉదయం ఆయన్ని అరెస్ట్‌ చేసి.. తొలుత కడపకు తరలించారు.

ఈ క్రమంలో యర్రగుంట్ల వద్ద పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు.. ఆయన్ను విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఆ తర్వాత. వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని ఎర్రగుంట్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడ్నుంచి మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు.

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా. రెండు చోట్లా హై టెన్షన్‌ వాతావరణం ఉంది. టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌ రెడ్డిని, వేంపల్లిలో సతీష్‌రెడ్డిని హౌస్‌ అరెస్ట్ చేశా...