Andhrapradesh,kadapa, ఆగస్టు 13 -- పులివెందుల, ఒంటిమిట్టలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ రెండు చోట్ల సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యందిశగా నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక బ్లాక్‌ డే. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలను రద్దుచేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేస్తున్నాం" అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

"చంద్రబాబు గారు. సీట్లో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమే. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ...