భారతదేశం, ఏప్రిల్ 18 -- కొన్ని నెల‌ల క్రితం మీడియా- సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా.. "సేవ్ పున‌ర్విక‌.. పున‌ర్వికను కాపాడుకుందాం.." అంటూ ల‌క్ష‌ల హృద‌యాలు స్పందించాయి. చేత‌నైన సాయం చేశాయి. చేయ‌లేని వారు ప్రార్థించారు. ఇంజెక్ష‌న్ కోసం వెల్లువ‌లా విరాళాలు వ‌చ్చాయి. ఇంకా చిన్నారి చిరున‌వ్వులు వెల‌గాలంటే 6 కోట్లు కావాలి.. అలాంటి సమయంలో మంత్రి నారా లోకేష్ ఆప‌న్న‌హ‌స్తం అందించారు. ఇంకా ఎంత అవ‌స‌ర‌మైతే అంతా తానే స‌మీక‌రిస్తాన‌ని, అన్ని విధాలా అండ‌గా ఉంటాన‌ని పున‌ర్విక త‌ల్లిదండ్రుల‌కు భ‌రోసా ఇచ్చారు.

ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఆ చిన్నారి చిరున‌వ్వుల కోసం అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన‌ నారా లోకేష్‌. పున‌ర్వికకు పున‌ర్జ‌న్మ‌ను ప్ర‌సాదించే చికిత్స‌కు సాయం అందించారు. విదేశాల నుంచి రూ.16 కోట్ల ఇంజెక్ష‌న్ తెప్పించేందుకు స‌హ‌క‌రించారు. ఇంజెక్ష‌న్ వేసేట‌ప్పుడు...