భారతదేశం, జూలై 3 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల రాచకుడైన సూర్య భగవానుడు త్వరలోనే తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. జూలై 6, 2026 న సూర్యుడు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించి, జూలై 19 వరకు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. పునర్వసు నక్షత్రానికి దేవగురువు బృహస్పతి (గురుడు) అధిపతిగా వ్యవహరిస్తాడు.

జ్యోతిష్య నిపుణుల ప్రకారం... సూర్యుడు, బృహస్పతి మధ్య మిత్ర భావన ఉంటుంది. మిత్ర గ్రహానికి చెందిన నక్షత్రంలోకి సూర్యుడు రావడం వల్ల ద్వాదశ రాశులపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగా, తిరుగులేని ధనలాభాలను ఇచ్చేదిగా మారబోతోంది. ఆ అదృష్ట రాశుల వివరాలు, వారు చేయాల్సిన పరిహారాలు ఇవే:

సూర్యుని నక్షత్ర మార్పు వల్ల మేష రాశి వారికి అన్ని రంగ...