భారతదేశం, సెప్టెంబర్ 27 -- Tamil Nadu Govt Gold Ring Scheme : తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ఆకర్షణీయమైన సంక్షేమ పథకాలలో ఒకటైన 'తాయ్‌మామన్ తంగ మోదిరం తిట్టం' (మేనమామ బంగారు ఉంగరం పథకం) సోమవారం ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతీ నవజాత శిశువుకు ప్రభుత్వం తరఫున ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారు ఉంగరాన్ని అందజేస్తారు. ఈ వినూత్న పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్... మధురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రి (జీఆర్‌హెచ్) వేదికగా ప్రారంభించనున్నారు.

ప్రత్యేక విమానంలో మధురై చేరుకోనున్న ముఖ్యమంత్రి విజయ్... జీఆర్‌హెచ్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని 25 మంది నవజాత శిశువులకు స్వయంగా ఈ బంగారు ఉంగరాలను అందజేస్తారు. అనంతరం ఆయన ఆసుపత్రిలోని ప్రసూతి వార్డును నేరుగా సందర్శించి, అదే రోజు జన్మించిన పసిపాపల త...