భారతదేశం, ఆగస్టు 19 -- భారత స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో రోజూ లాభాలతో దూసుకెళ్లింది. జీఎస్టీ హేతుబద్ధీకరణ, దేశ ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా వచ్చిన మెరుగైన క్రెడిట్ రేటింగ్ వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. ఫలితంగా, మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు భారీగా పుంజుకున్నాయి.

ఈ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 371 పాయింట్లు (0.46 శాతం) పెరిగి 81,644.39 వద్ద ముగిసింది. అదే విధంగా, నిఫ్టీ 50 కూడా 104 పాయింట్లు (0.42 శాతం) లాభపడి 24,980.65 వద్ద స్థిరపడింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం ఒక్కో శాతం చొప్పున పెరిగి బెంచ్‌మార్క్ సూచీల కంటే మెరుగైన పనితీరును కనబరిచాయి.

ఒక్కరోజే ఇన్వెస్టర్లకు సుమారు రూ. 4 లక్షల కోట్ల లాభం దక్కింది. మునుపటి ట్రేడింగ్‌లో రూ. 451 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్, ఒకే సెష...