Andhrapradesh, సెప్టెంబర్ 24 -- పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం రెండేళ్లల్లో పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శాసనసభలో మంగళవారం వైద్యారోగ్య శాఖపై చర్చ సందర్భంగా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం అంశాన్ని సీఎం ప్రస్తావించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంలోని వాస్తవాలను సభ ముందు ఉంచారు.

పీపీపీ మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం చంద్రబాబు సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..."చరిత్ర తెలియని వారు రాజకీయం కోసం మెడికల్ కాలేజీల నిర్మాణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైద్యారోగ్య రంగంలో మౌళిక సదుపాయాల కల్పన వేగంగా జరగాలంటే పీపీపీ విధానం అవసరం. 1996లో నేను తొలిసారి సీఎం అయినప్పుడు ఆరు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఉంది....