భారతదేశం, జూలై 20 -- మీరు కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులైతే కచ్చితంగా చేయాల్సిన పని ఒకటి ఉంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం 20వ విడతను విడుదల చేయనుంది. ఈ విడత పొందడానికి e-KYC చేయించుకోవడం తప్పనిసరి. ఈ-కేవైసీ చేయకపోతే రూ. 2000 మీకు రాకపోవచ్చు. ఆన్‌లైన్‌లో లేదా సీఎస్‌సీ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఈ-కేవేసీ చేయించుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం త్వరలో 20వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేయబోతోంది. ఈ విడత పొందడానికి, ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఈ పని సకాలంలో చేయకపోతే తదుపరి విడత రూ.2000 లభించదు. చాలా మంది రైతులు గత సంవత్సరం నిధులు వస్తే.. భవిష్యత్తులో కూడా వస్తూనే ఉంటుందని ఆలోచనతో నిర్లక్ష్యంగా ఉన్నారు. కానీ ఆధార్ ధృవీకరించకుండా, ఏ లబ్ధిదారునికి తదుపరి విడత లభించదని ప్రభుత్వం ఇప్పుడు స్పష్టం చేసింది. అంటే ఎవరైనా ...