భారతదేశం, అక్టోబర్ 9 -- అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) పొందాలని భావిస్తున్న విదేశీ ఉద్యోగులకు, ప్రముఖ ఐటీ కంపెనీలకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌తో పాటు భారతదేశానికి చెందిన ప్రముఖ ఐటీ సేవల దిగ్గజాలు టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కాగ్నిజెంట్, అడోబ్, క్యాప్‌జెమిని కంపెనీలపై విదేశీ ఉద్యోగుల శాశ్వత కార్మిక ధృవీకరణ ప్రక్రియ అయిన 'పీఈఆర్‌ఎమ్' (PERM) సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ, తక్కువ వేతనాలకే విదేశీ కార్మికులను తీసుకునేందుకు ఈ కంపెనీలు వీసా నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం (అక్టోబర్ 8న) ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ, విదేశీ నైపుణ్య కార్మికు...