భారతదేశం, ఆగస్టు 20 -- మీ పిల్లలకు తరచూ జలుబు, జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయా? రోజూ స్కూలుకు, డే కేర్‌కు వెళ్లే పిల్లలు ఇలా జబ్బుపడటం చూసి చాలామంది తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. ఇది చాలా సాధారణమైన విషయం, ముఖ్యంగా ఏడు సంవత్సరాల లోపు పిల్లలకు ఇలా జరగడం సహజం. ఎందుకంటే వారి రోగనిరోధక వ్యవస్థ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందదు. బడికి వెళ్తున్నప్పుడు కొత్త సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలు, వైరస్‌లకు గురై వాటితో పోరాడటం నేర్చుకుంటుంది. తరచూ అనారోగ్యానికి గురవుతున్నారంటే, వారి రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతోందని అర్థం చేసుకోవాలి.

పిల్లల్లో పటిష్టమైన రోగనిరోధక వ్యవస్థను నిర్మించడానికి కొన్ని అంశాలు అవసరం. సమతుల్య ఆహారం, శారీరక శ్రమ, తగినంత నిద్ర, పరిశుభ్రత, ఒత్తిడి లేని వాతావరణం. అపరిశుభ్రమైన ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రాంతాలు, సరైన వైద్య స...