భారతదేశం, ఆగస్టు 24 -- మదుపరులు తమ కష్టార్జితాన్ని సురక్షితంగా దాచుకోవడానికి, మంచి రాబడి పొందడానికి పోస్ట్ ఆఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకాల (Small Savings Schemes) వైపు మొగ్గు చూపుతుంటారు. ప్రభుత్వ గ్యారెంటీ ఉండటంతో ఇందులో డిపాజిట్లకు పూర్తి రక్షణ లభిస్తుంది. అయితే కేవలం వడ్డీ రేటు మాత్రమే కాకుండా.. లాక్-ఇన్ పీరియడ్, డిపాజిట్ గరిష్ట పరిమితి, పన్ను మినహాయింపులు (Tax Benefits) వంటి అంశాలను బట్టి ఏ పథకం ఎవరికి అనుకూలమో మారుతుంది.

పెట్టుబడి సమయంలో లభించే పన్ను మినహాయింపు, రాబడి పెరుగుతున్నప్పుడు పడే పన్ను, మెచ్యూరిటీ ఉపసంహరణ సమయాల్లో ఉండే నిబంధనలను బట్టి ప్రధాన పథకాలను విశ్లేషించుకుందాం.

దీర్ఘకాలిక పొదుపుతో పాటు గరిష్ట పన్ను ఆదా కోరుకునే వారికి ఈ రెండు పథకాలు అనుకూలమైన మార్గాలు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): వార్షికంగా 7.1 శాతం వడ్డీని అ...