భారతదేశం, జనవరి 7 -- పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య క‌ళాశాల‌లో 2025-26 విద్యా సంవ‌త్సరంలో ఎంబీబీఎస్ ప్రవేశాల‌ను క‌ల్పించే దిశ‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖ చేసిన కొన్ని ప్రధాన ప్రతిపాద‌న‌ల‌కు ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ప‌థ‌కం(సీయ‌స్‌య‌స్‌) కింద రాష్ట్ర ప్రభుత్వమే పిడుగురాళ్ల క‌ళాశాల‌ను నిర్మించి, నిర్వహించ‌నుంది. ఈ ప‌థ‌కం కింద కేంద్రం పిడుగురాళ్ల క‌ళాశాలకు రూ.195 కోట్ల స‌హాయాన్ని మంజూరు చేసి రాష్ట్రానికి విడుద‌ల చేసింది.

మొద‌టి ద‌శ‌లో 100 ప్రవేశాల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాలు, సిబ్బంది నియామ‌కాల‌కు సంబంధించిన‌ ప్రతిపాద‌నల‌ను ముఖ్యమంత్రి అంగీక‌రించారు. నేష‌న‌ల్ మెడిక‌ల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) ప్రస్తుత‌ నిబంధ‌న‌ల మేర‌కు 100 ఎంబీబీఎస్ ప్రవేశాల‌కు 420 ప‌డ‌క‌ల‌తో కూడిన బోధ‌నాసుప‌త్రిని స‌మ‌కూర్చాల్సి ఉంటుంది.

గ‌త ప్...