భారతదేశం, సెప్టెంబర్ 4 -- ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంలోని ఉపాధ్యాయులకు ఒక రోజుముందుగానే కానుకలు పంపించారు. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5వ తేదీన ఉంది. అయితే ఈరోజు అంటే సెప్టెంబర్ 4వ తేదీని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండు వేల మంది ఉపాధ్యాయులకు గిఫ్ట్స్ పంపించారు.

పిఠాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు, జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకులకు మెుత్తం 2 వేల మందికి గిఫ్ట్స్ పంపారు. ఇందులో మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంట్, షర్టు అందించారు. పవన్ కల్యాణ్‌కు చెందిన స్పెషల్ టీమ్ వీటని పంపిణీ చేసింది. పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని విద్యాశాఖ ఆఫీసుల్లో అందించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కానుకలు పంపడంపై ఆనందం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎంకు గురువు...