భారతదేశం, అక్టోబర్ 24 -- విశ్రాంత జీవితం గడుపుతున్న ఉద్యోగులకు ఈపీఎఫ్​ఓ (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి ఏటా పింఛను క్రమం తప్పకుండా రావడానికి సమర్పించాల్సిన 'జీవన్ ప్రమాణ్ పత్ర' ప్రాసెసింగ్‌ను మరింత సులభతరం చేసినట్టు ప్రకటించింది. వయోభారంతో బాధపడేవారు, ఆరోగ్య సమస్యలతో బయటకు రాలేని వృద్ధులు బ్యాంకులు లేదా ఈపీఎఫ్‌ఓ కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన పనిలేకుండా కొత్త సేవను అందుబాటులోకి తెచ్చినట్టు స్పష్టం చేసిదంి.

"పింఛనుదారులు బయటకు రావాల్సిన అవసరం లేదు. మీ ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలను ఉపయోగించుకోండి. మీ సౌకర్యమే మా ప్రాధాన్యం," అని ఈపీఎఫ్‌ఓ సామాజిక మాధ్యమం 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.

ప్రతి ఏటా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి నవ...