భారతదేశం, సెప్టెంబర్ 16 -- గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలని, లేదంటే ఎగ్జామ్ మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. రూ.3 కోట్లు ఇచ్చి గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించారని ఆరోపణలు వచ్చాయి. రూ.1700 కోట్ల స్కామ్ జరిగిందని చాలా మంది అనడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు మాట్లాడారు.

గ్రూప్ 1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయెుద్దని ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. కొంతమంది నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు చేయడం కాదు.. వాటిని నిరూపించాలన్నారు. అప్పులు చేసి.. ఓ పూట తిని.. మరో పూట తినక రెక్కలు ముక్కలయ్యేలా.. తమ పిల్లలను కష్టపడి చదివించామని తెలిపారు. ఎన్నో త్యాగాలు చేసి చదివిపిస్తే.. రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నట్టుగా నిందలు వేయడం ఏంటన...