భారతదేశం, జూలై 4 -- గోదావరి నదిపై పర్యాటక బోటు ప్రయాణాల కోసం ఎదురుచూస్తున్న పర్యాటకులకు లైన్ క్లియర్ అయింది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఫెర్రీ పాయింట్ నుండి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల వరకు శనివారం నుండి పర్యాటక బోటు సర్వీసులు ప్రారంభమయ్యాయి. భద్రతా తనిఖీలు (సేఫ్టీ ఆడిట్) విజయవంతంగా పూర్తి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

గత నెల జూన్ 14వ తేదీన భద్రతా కారణాలు, సాంకేతిక లోపాలను ఉటంకిస్తూ జిల్లా యంత్రాంగం పాపికొండల రూట్‌లో నడిచే పర్యాటక బోట్లను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. బోటు ఆపరేటర్లు అందరూ కచ్చితంగా సమగ్ర భద్రతా తనిఖీలు చేయించుకోవాలని, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందాలని అధికారులు అప్పట్లో ఆదేశించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీ...