భారతదేశం, సెప్టెంబర్ 15 -- పాత పెన్షన్ విధానం కోసం ఉద్యోగుల ఆందోళన ఉధృతమవుతోంది. 'పాత పెన్షన్' (OPS) విధానాన్ని అమలు చేసే పార్టీలకే ఓటు వేస్తామని ఉద్యోగులు నినదించారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన 'పెన్షన్ సంఘర్ష్' సభలో పాల్గొన్న ఉద్యోగులు ఈ మేరకు 'ఓట్ ఫర్ ఓపీఎస్' అంటూ ప్రతిజ్ఞ చేశారు. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీహార్ మిల్లర్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (NMOPS) సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో ఈ భారీ బహిరంగ సభ జరిగింది.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వందలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ సభకు హాజరయ్యారు. NMOPS ప్రతినిధులు విజయ్ బంధు, జార్ఖండ్ అధ్యక్షులు విక్రాంత్, తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కారకట్ నియోజకవర్గ సీపీఐ ఎంపీ రాజా రామ్ సింగ్, హిమాచల్ ప్రదే...