Telangana, ఆగస్టు 12 -- తెలంగాణ టెన్త్ పరీక్షల నిర్వహణపై కీలక అప్డేట్ వచ్చేసింది. మళ్లీ పాత పద్ధతిలోనే పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

2025-26 విద్యా సంవత్సరం నుంచి 80 శాతం ఎక్స్‌టర్నల్‌, 20 శాతం ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ఉండనున్నాయి. పాత పద్ధతిని కొనసాగించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా. విద్యాశాఖ నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇంటర్నల్‌ మార్కులను తొలగిస్తూ గత ఏడాది నవంబరులో ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇటీవల ఢిల్లీలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి వర్క్‌షాప్‌లోఈ నిర్ణయంపై పలు అంశాలు చర్చకు వచ్చాయి. దీంతో పునరాలోచనలో పడిన పాఠశాల విద్యాశాఖ .. పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది.

పదో తరగతిలో ఇంటర్నల్‌ మార్కులను ఎత్తివేయాలని. మొత్తం 100 మార్కులకు ...