పాడేరు పాస్టర్‌పై దాడి సీన్ రివర్స్.. అంతా హైడ్రామా.. ఎస్పీ సంచలన నిజాలు!
భారతదేశం, మే 20 -- అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో తీవ్ర సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి ఉదంతం సరికొత్త మలుపు తిరిగింది. పాస్టర్‌పై జరిగిన దాడి కేవలం ఒక హైడ్రామా అని, అదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం సృష్టించిన కల్పిత కథ అని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ అధికారికంగా ప్రకటించారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు నిజాలను మీడియా ముందు ఉంచుతూ, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చేసిన ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ కల్పిత దాడి ఘటనకు సంబంధించి పాస్టర్‌తో పాటు మొత్తం ఎనిమిది మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ హైడ్రామాలో కీలక పాత్ర పోషించిన వారిని నిందితులుగా చేర్చారు: ఏ1 : పాస్టర్ అభినయ్ దర్శన్, ఏ2 : బిల్లా కిరణ్, ఏ3 : కె. బెన్హర్, ఏ4 : భాను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.