భారతదేశం, అక్టోబర్ 2 -- న్యూఢిల్లీ: పాఠశాలల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా వ్యవస్థలో డిజిటల్ చెల్లింపులను విస్తృతంగా అమల్లోకి తీసుకురావడానికి పలు ముఖ్యమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనికి సంబంధించి అధికారిక నోటీసును బోర్డు వెబ్‌సైట్ cbse.gov.in లో అందుబాటులో ఉంచింది.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం (డీఎఫ్ఎస్) దేశవ్యాప్తంగా సురక్షితమైన డిజిటల్ లావాదేవీలను విస్తరించడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా పాఠశాలలు, విద్యార్థులు, తల్లిదండ్రులను డిజిటల్ చెల్లింపుల పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు.

పాఠశాలల్లో ఫీజులు, క్యాంటీన్‌లు, లైబ్రరీలు, ఇతర సేవల కోసం యూపీఐ (UPI), రూ పే (RuPay) కార్డుల చెల్ల...