భారతదేశం, మే 29 -- హల్గామ్ ఉగ్రదాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత దాడి సూత్రధారి సైఫుల్లా కసూరి బహిరంగంగా ప్రత్యక్షమయ్యాడు. లష్కరే తోయిబా కమాండర్ అయిన సైఫుల్లా ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నాడు. లష్కరే తదుపరి వారసుడిగా భావిస్తున్న హఫీజ్ సయీద్ కుమారుడు కూడా సైఫుల్లా వెంట ఉన్నాడు. ఉగ్రవాదులతో బహిరంగంగా వేదిక పంచుకుంటున్న పలువురు పాక్ నేతలు కూడా ఈ ర్యాలీలో కనిపించారు.

పాకిస్థాన్‌ అణుపరీక్షల వార్షికోత్సవం సందర్భంగా పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఏటా యూమ్-ఇ-తక్బీర్ గా జరుపుకొంటారు. ఈ సంబరాల్లో భాగంగా ఈ ర్యాలీ కూడా జరిగింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులు భారత్‌పై విషం చిమ్మారు. ఈ ర్యాలీలో భారత్ వ్యతిరేక నినాదాలు చేశారు.

తనను పహల్గాం ఉగ్రదాడికి మాస్టర్‌మైండ్‌గా చెప...