Andhrapradesh, ఆగస్టు 17 -- పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో క్రియాశీలకంగా ఉంటూ, జిహాదీ ప్రచార సామగ్రిని కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ధర్మవరానికి చెందిన నూర్ మహ్మద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామం శ్రీసత్యసాయి జిల్లాలో సంచలనంగా మారింది.

నిందితుడు షేక్ కొత్వాల్ నూర్ మహ్మద్ ను శనివారం కదిరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా. కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ నుంచి అందిన సమాచారం మేరకు అతని నివాసంలో శనివారం ఉదయం సోదాలు జరిపి. మహ్మద్ ను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ వి.రత్న తెలిపారు.

ఈ సోదాల్లో ఓ మొబైల్ ఫోన్, జిహాదీ సాహిత్యం ఉన్న పుస్తకాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ ఎస్ ఎల్ )కు పంపినట్లు...