భారతదేశం, ఆగస్టు 2 -- ప్రధాని నరేంద్ర మోడీ తన లోక్ సభ నియోజకవర్గం వారణాసి నుంచి పాకిస్థాన్‌కు నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ఈసారి ఉగ్రదాడికి పాక్ కుట్ర పన్నితే యూపీకి చెందిన బ్రహ్మోస్ క్షిపణి దాన్ని ధ్వంసం చేస్తుందని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయనున్నారు. 'ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మన ఆయుధాల సత్తాను ప్రపంచం మొత్తం చూసింది. మన గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులు భారత్ బలాన్ని నిరూపించాయి. బ్రహ్మోస్ పేరు వింటే పాక్ కు నిద్రలేకుండా పోతుంది.' అని ప్రధాని మోదీ అన్నారు.

బ్రహ్మోస్ క్షిపణులు యూపీలోనూ తయారవడం సంతోషంగా ఉందన్నారు మోదీ. పలు బడా కంపెనీలు కూడా యూపీ డిఫెన్స్ కారిడార్ లో తమ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. రాబోయే కాలంలో యూపీలో తయారైన ఆయుధాలు భారత సైన్యానికి బలంగా మారనున్నాయన్నారు. ఆపరేషన్ సి...