భారతదేశం, ఏప్రిల్ 22 -- భక్తుల నిరీక్షణ ఫలించింది. మంచు పర్వతాల మధ్య కొలువై ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయ తలుపులు నేడు ఏప్రిల్ 22, 2026 ఉదయం వైభవంగా తెరుచుకున్నాయి. ఏటా చలికాలంలో మంచు తాకిడి వల్ల ఆరు నెలల పాటు మూసి ఉంచే ఈ ఆలయాన్ని, ఎండలు మొదలై దారులు క్లియర్ కావడంతో తిరిగి ప్రారంభించారు. శివనామస్మరణతో హిమాలయ లోయలు మారుమోగుతున్నాయి.

బాబా కేదార్‌నాథ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, కోట్లాది మంది హిందువుల అచంచల విశ్వాసానికి కేంద్రం. చలికాలంలో ఆలయ ద్వారాలు మూసివేసినప్పుడు, శివుడి ఉత్సవ విగ్రహాన్ని (చల్ విగ్రహ డోలి) ఉఖీమఠంలోని ఓంకారేశ్వర ఆలయానికి తరలిస్తారు. ఆరు నెలల పాటు అక్కడే పూజలు అందుకున్న స్వామివారు, వేసవి రాగానే తిరిగి కేదార్‌నాథ్ చేరుకుంటారు. నిన్న సాయంత్రమే బాబా వారి డోలి ధామ్‌కు చేరుకోవడంతో భక్తుల ఉత్సాహం మిన్నంటింద...