భారతదేశం, జూలై 19 -- తెలంగాణలో విద్యా వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు, నకిలీ హాజరు విధానానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్టూడెంట్-టీచర్స్ (ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న విద్యార్థులు) పరీక్ష ఫీజు చెల్లించాలన్నా, లేదా వార్షిక పరీక్షలకు హాజరు కావాలన్నా బయోమెట్రిక్ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(FRS - Facial Recognition System) హాజరు డేటా అత్యంత కీలకం కానుంది. ఎఫ్‌ఆర్ఎస్ ద్వారా నమోదయ్యే హాజరును పరీక్షల అర్హత ప్రక్రియతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది.

నూతనంగా ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ హాజరు అనుసంధాన ప్రక్రియ 2026-27 విద్యా సంవత్సరం నుంచే అమలు కానుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ నిర్వహణలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (DIETs - District Institute of Education an...