భారతదేశం, జూలై 6 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెకండరీ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జాబ్ నోటిఫికేషన్ ప్రకటించింది. నిరుద్యోగులకు మంచి సరికొత్త ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది. శ్రీకాకుళం జిల్లా పరిధిలోని జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(DCHS) కార్యాలయం, వివిధ జిల్లా సెకండరీ హెల్త్ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పూర్తిగా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఈ నియామకాలు జరగనున్నాయి. అర్హత, ఆసక్తి గల స్థానిక అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

జనరల్ డ్యూటీ అటెండెంట్ : 15 పోస్టులు

పోస్ట్‌మార్టం అసిస్టెంట్: 03 పోస్టులు

థియేట...