భారతదేశం, మే 26 -- దేశంలో పన్ను వివాదాల పరిష్కారంలో కీలక పాత్ర పోషించే ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT)లో పరిపాలనా సిబ్బంది కొరతపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా దశాబ్ద కాలంగా నియామకాలు చేపట్టకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వ్యవస్థల పనితీరుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రవీణ్ కుమార్ బన్సాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు సంచలన విషయాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 30 ఐటీ ఏటీ (ITAT) బెంచ్‌లలో అసిస్టెంట్ రిజిస్ట్రార్, పీఎస్సీ (PSC) వంటి కీలక పోస్టులన్నీ ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయని ఆయన వివరించారు.

"అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప...