భారతదేశం, ఆగస్టు 21 -- పదవీ విరమణ పొంది, రిటైర్మెంట్ ప్రయోజనాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్ విధానాన్ని (Pension Scheme) మార్చుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సర్వీసులో ఉన్నంత కాలం ఒక స్కీమ్ కింద కొనసాగి, రిటైర్ అయిన తర్వాత వేరే స్కీమ్ వర్తింపజేయాలని కోరడం చెల్లదని స్పష్టం చేసింది.

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (NIRD)లో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన చంద్ర అనే వ్యక్తి కేసులో కోర్టు ఈ తీర్పును వెలువరించింది. సెంట్రల్ పెన్షన్ ఫండ్ (CPF) కింద ప్రయోజనాలు తీసుకున్న ఆయన, తనకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) వర్తింపజేయాలని కోరుతూ న్యాయ పోరాటానికి దిగారు.

పిటిషనర్ చంద్ర 1984 నవంబర్ 12న ఎన్ఐఆర్‌డిలో కాంట్రాక్ట్ పద్ధతిన రీసెర్చ్ అసోసియేట్‌గా చేరారు. మరుసటి రోజే ఆయనను సీపీఎఫ్ ...