భారతదేశం, సెప్టెంబర్ 23 -- రైతులు పత్తి అమ్ముకోవాలంటే మధ్యవర్తుల దోపిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటివాటికి చెక్ పెట్టేందుకు సీసీఐ కొత్త యాప్ విధానం తీసుకొచ్చింది. 'కపాస్ కిసాన్' యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సీజన్ రైతులు పంట అమ్ముకునేదుకు తమ వివరాలు, పంట సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేయాలి.

ఇలా చేయడం ద్వారా సెంటర్ల వద్ద రైతుల రద్దీని కంట్రోల్ చేయడమే కాకుండా.. అక్రమాలను అడ్డుకోవచ్చని సీసీఐ అనుకుంటోంది. కపాస్ కిసాన్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రైతు పేరు, జండర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, అడ్రస్, ఆధార్, మెుబైల్ నంబర్, అడ్రస్‌తో రిజిస్టర్ అవ్వాలి. అనంతరం ఏ మార్కెట్‌లో పత్తి అమ్మాలనుకుంటున్నారో ఆ వివరాలు ఎంటర్ చేయాలి.

అంతేకాదు భూమి సొంతమా, కౌలుదారా చెప్పాలి. ...