భారతదేశం, ఆగస్టు 9 -- విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది నీటి ప్రవాహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి తన నివాసానికి వెళ్తుండగా.. బ్యారేజీ వద్ద కాన్వాయ్‌ను కొద్దిసేపు ఆపారు. బ్యారేజీపై నిలబడి నదిలో నీటి మట్టాన్ని, ప్రవాహ వేగాన్ని ఆయనే స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద నీటి వివరాలను, డెల్టా కాలువలకు విడుదల చేస్తున్న నీటి పరిమాణాన్ని ముఖ్యమంత్రికి వివరంగా అందించారు.

ఈ వర్షాకాల సీజన్‌లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటివరకు 17.52 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా నదికి విజయవంతంగా తరలించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ప్రవాహాలు వస్తున్నాయని... అందువల్ల ఇప్పటివరకు 521 టీఎంసీల ...