భారతదేశం, నవంబర్ 24 -- భారతీయ కుటుంబాల్లో పండుగల సీజన్ అంటే కేవలం వేడుకలు మాత్రమే కాదు, పెద్ద ఎత్తున కొనుగోళ్లకు శుభముహూర్తం. ఇంటి ఆధునికీకరణ (హోమ్ రెనోవేషన్), కొత్త గృహోపకరణాల కొనుగోలు, వాహనాలు ఇంటికి తెచ్చుకోవడం వంటి కీలక నిర్ణయాలన్నీ పండుగల చుట్టే తిరుగుతాయి. అయితే, ఈ ఆశయాలను నెరవేర్చుకునే క్రమంలో భారతీయ కుటుంబాలు డబ్బు, అప్పుల గురించి ఆలోచించే తీరులో వేగంగా మార్పు వస్తోంది. గతంతో పోలిస్తే అధికారిక రుణ వ్యవస్థ (ఫార్మల్ క్రెడిట్) ఇప్పుడు సామాన్యులకు మరింత చేరువైంది. బ్యాంకు రుణాలు, క్రెడిట్ కార్డుల సాయంతో ప్రజలు తమ భారీ ఖర్చులను పక్కా ప్రణాళికతో ఆర్థిక నిర్ణయాలుగా మలుచుకుంటున్నారు.

ఈ పరిణామాలపై 'క్రిఫ్' (CRIF) ఇండియా, దక్షిణాసియా రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ సచిన్ సేథ్ కీలక విశ్లేషణ చేశారు. తాజా గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ 2026 నాటికి ...