భారతదేశం, సెప్టెంబర్ 11 -- తెలంగాణలోని గ్రామ పంచాయతీల ఆర్థిక పురోగతికి, గ్రామీణ ప్రాంతాల స్వయం సమృద్ధికి బాటలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీలకు లభించే పన్నులు, ఇతర సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీలతో నిమిత్తం లేకుండా నేరుగా స్థానిక బ్యాంకుల్లో జమ చేసుకుని అభివృద్ధి పనులకు వెచ్చించేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన 'తెలంగాణ పంచాయతీరాజ్ (నాలుగో సవరణ) బిల్లు-2026' అసెంబ్లీతో పాటు శాసనమండలిలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.

గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనకు ప్రజాప్రతినిధులు సంపూర్ణ మద్దతు తెలిపారు. 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 70(3)కి సవరణలు చేయడం ద్వారా గ్రామాల్లో నిధుల వినియోగానికి దశాబ్దాలుగా ఎదురవుతున్న అవరోధాలకు శాశ్వత పరిష్కారం లభించింది.

గ్రామాల్లో మురుగున...