భారతదేశం, అక్టోబర్ 24 -- రాడిక్స్ సంఖ్యల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ఒకరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో రాడిక్స్ సంఖ్యలు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి.

ఈ సంఖ్యల ఆధారంగా మనిషి గురించి అనేక విషయాలను చెప్పవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. వ్యాపారాలు మొదలుపెడితే కుబేరులుగా మారిపోతారు. మరి అలాంటి వారు ఎవరు? ఏ సంఖ్యల వారికి వ్యాపారంలో బాగా కలిసి వస్తుందో చూసేద్దాం.

ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి సంఖ్య ఒకటి అవుతుంది. సూర్యుడు అనుగ్రహంతో ఈ తేదీల్లో పుట్టిన వారు వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సూర్యుడు నాయకత్వ లక్షణాలు, ధైర్యం మొదలైన వాటికి కారకుడు.

ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ మంచి నిర్ణయాలు తీసుకుంట...