భారతదేశం, జనవరి 3 -- వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో చైత‌న్య‌ రావు మ‌దాడి. ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ సినిమానే వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ కె. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న రా అండ్ రూటెడ్ ఫిల్మ్ 'దిల్ దియా'. 'ఏ నేక్డ్ ట్రూత్' అనేది ట్యాగ్ లైన్.

శ్రియాస్ చిత్రాస్‌, ఎ పూర్ణ నాయుడు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్‌పై పూర్ణ నాయుడు దిల్ దియా సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న దిల్ దియా సినిమా టైటిల్, ఫ‌స్ట్ లుక్‌ను సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ను అభినందించారు.

ఇక దిల్ దియా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను గ‌మ‌నిస్తే.. హీరో చైతన్య రావు ఒంటి మీద బ‌ట్ట‌లు లేకుండా సొఫాలో కూర్చుని ఉన...