భారతదేశం, సెప్టెంబర్ 29 -- ఏపీలో న్యాయవాదుల సంక్షేమానికి బార్ కౌన్సిల్ పెద్దపీట వేస్తోంది. తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బార కౌన్సిల్ ఛైర్మన్ నల్లారి ద్వారకానాథ్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఇప్పటిదాకా న్యాయవాది మృతి చెందితే.. కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం రూ.6లక్షలు ఇచ్చేవారు. అయితే దీనిని తాజాగా రూ.9లక్షలకు పెంచారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ రూ.4 లక్షలు కూడా ఉంటుంది.

అనారోగ్యంతో బాధపడే న్యాయవాదులు, వారి భార్యలకు అందించే ఆర్థిక సాయం రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షలు పెంచారు.

మరణించిన న్యాయవాదుల క్లర్కుల కుటుంబాలకు ఇప్పటివరకు రూ.4లక్షలుగా ఉన్న మరణాంతర ప్రయోజనాన్ని రూ.4.50లక్షలకు పెంపు చేశారు. అంతేకాదు వైద్య సాయం కింద ఇచ్చే రూ.80 వేలను రూ.లక్షకు పెంచారు. అక్టోబర్ 1...