భారతదేశం, ఆగస్టు 11 -- న్యూఢిల్లీ, ఆగస్టు 11 (పీటీఐ): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత ఆరోపణలు చేసిన పిటిషనర్‌తో పాటు అతడి న్యాయవాదులకు సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, న్యాయమూర్తులు జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ అతుల్ ఎస్.చందుర్‌కర్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును సుమోటోగా విచారించింది. హైకోర్టు న్యాయమూర్తులపై ఇలాంటి ఆరోపణలు చేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసింది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమోదైన ఎస్సీ/ఎస్టీ కేసును హైకోర్టు న్యాయమూర్తి కొట్టివేయడంపై ఎన్.పెద్దిరాజు అనే పిటిషనర్ సుప్రీంకోర్టులో బదిలీ పిటిషన్ (Transfer Petition) దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో హైకోర్ట...