భారతదేశం, మే 26 -- ఒక విద్యార్థి తన భవిష్యత్తు కోసం కష్టపడి చదివి పరీక్ష రాస్తాడు. తీరా ఫలితాలు వచ్చాక, తన పేపర్ కాకుండా ఎవరో రాసిన పేపర్‌ను తనదిగా చూపిస్తే ఆ కుర్రాడి ఆవేదన వర్ణనాతీతం. ఢిల్లీకి చెందిన వేదాంత్ శ్రీవాస్తవ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. సీబీఎస్‌ఈ (CBSE) చేసిన సాంకేతిక తప్పిదం వల్ల ఒక ప్రతిభావంతుడైన విద్యార్థి మానసిక క్షోభ అనుభవించడమే కాకుండా, నెటిజన్ల నుంచి దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది.

మే 13న విడుదలైన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో వేదాంత్‌కు ఫిజిక్స్ (Physics) సబ్జెక్టులో ఊహించిన దానికంటే చాలా తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో అనుమానం వచ్చి మే 19న తన ఆన్సర్ షీట్ స్కాన్డ్ కాపీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మే 23న బోర్డు పంపిన కాపీని చూసి వేదాంత్ నివ్వెరపోయాడు. అందులో ఉన్న చేతిరాత తనది కాదు. ఇంగ్లీష్, కంప్యూటర్ సై...