భారతదేశం, జూలై 16 -- మనం ఇంటి అద్దె కోసం వెళ్లినప్పుడు రకరకాల టులెట్ బోర్డులు కనిపిస్తాయి. కొన్నింటి మీద ఓన్లీ ఫర్ ఫ్యామిలీ, నో పెట్స్, నాన్ వెజ్ నాట్ అలో.. ఇలా రకరకాల బోర్డులు ఉంటాయి. అయితే ఇప్పుడు బెంగళూరులో ఇంటి యజమానులు టులెట్ బోర్డులో మరో కొత్త విషయాన్ని కూడా చేర్చుతున్నారు. అదేంటంటే.. 'నో పాన్-చూవర్స్. 'పెంపుడు జంతువులకు ఉండొద్దు' లేదా 'బ్యాచిలర్లకు కాదు' వంటి మాటలే కాదు.. ఇప్పుడు పాన్ నమిలేవారికి కూడా అద్దెకు ఇవ్వమంటున్నారు.

అద్దె ఒప్పందాలలో పాన్ నమలడం, ధూమపానం, వంటగదిలో నాన్ వెజ్ వండకూడదని షరతులు ఉన్నాయి. పాన్ ఉమ్మడం వల్ల మరకలు పడుతుండడంతో సొంత ఖర్చుతో గోడలకు రంగులు వేయడం లేదా మార్బుల్ టైల్స్ మార్చడం చేయాల్సి వచ్చిందని కొందరు ప్రాపర్టీ యజమానులు చెబుతున్నారు. తన అద్దె ఒప్పందంలో అద్దెకు వచ్చేవారికి పాన్ నమలడాన్ని నిషేధించే నిబంధన ఉ...