భారతదేశం, సెప్టెంబర్ 26 -- హైదరాబాద్ నగరంలో శుక్రవారం (సెప్టెంబరు 25) జరిగిన 'కంపాషన్ ఇన్ యాక్షన్' కార్యక్రమంలో టాలీవుడ్ నిర్మాత, రామానాయుడు స్టూడియోస్ చైర్మన్, సురేశ్ ప్రొడక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ దగ్గుబాటి సురేశ్ బాబు అడిగిన ప్రశ్నలకు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో సంస్కరణల ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు.

అమెరికా సహా అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలిక కోర్సుల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. భారతదేశంలో విద్యార్థులు కళాశాలల్లో నేర్చుకుంటున్న దానికి, పారిశ్రామిక అవసరాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని విద్యా రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

విద్యాసంస్థలు ఎప్పటికీ వ్యాపార కేంద్రాలు కాకూడదు. చాలా పాఠశాలల్లో విలువల విద్య, నైతిక ...