భారతదేశం, సెప్టెంబర్ 10 -- నేపాల్‌లో అశాంతి మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ వాసుల కోసం హెల్ప్‌లైన్ ప్రారంభించింది. తెలంగాణ పౌరులకు సహాయం చేయడానికి సహాయక కేంద్రాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసింది. ఇందుకోసం ముగ్గురు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రస్తుతానికి ఎవరికి హాని జరగలేదని, తప్పిపోయిన వ్యక్తులు లేరని అధికారులు కన్ఫామ్ చేశారు. భద్రత కోసం విదేశాంగ, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం.

నేపాల్‌లోని తెలంగాణ స్థానికులను, రాష్ట్రంలోని వారి కుటుంబాలను తిరిగి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటివరకు తెలంగాణ పౌరులెవరూ గాయపడినట్లు లేదా తప్పిపోయినట్లు నివేదిక లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ ...