భారతదేశం, ఆగస్టు 27 -- నేపాల్‌లో సంభవించిన వరద విపత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా చిక్కుకుపోయారా అనే విషయంపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. నేపాల్ వరదల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ నివాసితులను గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

నేపాల్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారి గురించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. నేపాల్‌లో చిక్కుకున్న ప్రజల గురించి సమాచారం కోరుకునే వారు ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ నంబర్లు: 011-23384016, 011-23387089, వాట్సాప్: 9059824101ని సంప్రదించవచ్చు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించి, ప్రభావిత యాత్రికులకు సహాయం అందించాలని చంద్రబాబు నాయ...